‘వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రతిసారీ రావాలని భావించినా కుదరలేదు. ఇప్పుడు మహా కుంభమేళాకు రావడం చాలా ఆనందం కలిగిస్తోంది’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నా రు. భార్య అనా కొణిదెల, కుమారుడు అకిరానందన్, సినీ దర్శకుడు త్రివిక్రమ్, టీటీడీ సభ్యుడు ఆనంద సాయితో కలిసి మంగళవారం ఆయన మహాకుంభ మేళాలో పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమానికి హారతులిచ్చారు. పవన్ మీడియాతో మాట్లాడుతూ ‘భారతీయులంతా విభిన్నమైన జాతులు, తెగలు, సంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధ ర్మం విషయంలో మాత్రం ఏకమవుతారు. సనాతన ధర్మం ఇలాగే భవిష్యత్తులోనూ పరిఢవిల్లాలి. ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు. మహాకుంభమేళాలో జరిగిన కొన్ని ఘటనలు దురదృష్టకరం. సనాతన ధర్మాన్ని నమ్మే, పాటించే వారిపై ఇలాంటి సమయంలో కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడటం బాధ్యతారాహిత్యమే. మహాకుంభమేళా నిర్వహణలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పని చేస్తోంది. సనాతన ధర్మం నమ్మే వారి మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడడం మంచిది కాదు’ అన్నారు. పశ్చిమ బెంగా ల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ‘మృత్యు కుంభమేళా’ వ్యాఖ్యలపై స్పంది స్తూ.. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీస్తున్నామని మమతాబెనర్జీ గుర్తించడం లేదన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.