‘భారత్‌తో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్నది ఒక్కటే సమస్య. అది ప్రపంచంలో అత్యధికంగా టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఒకటి అవడమే’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
- అధిక టారిఫ్‌లొక్కటే సమస్య
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Donald Trump | న్యూయార్క్/వాషింగ్టన్, మార్చి 20: ‘భారత్‌తో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్నది ఒక్కటే సమస్య. అది ప్రపంచంలో అత్యధికంగా టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఒకటి అవడమే’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వచ్చే నెల ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై ప్రతీకార సుంకాలుంటాయని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా వస్తూత్పత్తులపై ఎంత సుంకాలు వేస్తున్నారో.. అంతే సుంకాలు ఆయా దేశాల వస్తూత్పత్తులపై వేస్తామంటున్నారు ట్రంప్.
ఈ నేపథ్యంలో స్థానిక బ్రిట్‌బర్ట్ న్యూస్‌కు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారత్‌తో అమెరికాకున్న సంబంధాలపై ట్రంప్ మాట్లాడారు. ఈ క్రమంలోనే గత నెల ప్రధాని నరేంద్ర మోదీతో వైట్‌హౌజ్‌లో జరిగిన సమావేశం గురించి అడిగిన ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు. ఇక ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడర్ (ఐఎంఈసీ)పై మాట్లాడుతూ.. ‘అదో అద్భుతమైన దేశాల కూటమి. వాణిజ్యంలో మనకు హాని కలిగిస్తున్న దేశాలకు ధీటైన జవాబివ్వాలని అవి కలిసి పనిచేస్తున్నాయి.
మాకూ వాణిజ్యంలో శక్తివంతమైన భాగస్వామ్య దేశాలున్నాయి’ అన్నారు. కానీ ఇకపై అమెరికాకు ఏ భాగస్వాములూ చెడు చేయనివ్వమన్నారు. ఇందులోభాగంగానే భారత్, ఐరోపా దేశాలు అమెరికా నుంచి తమ దేశాల్లోకి దిగుమతి అవుతున్న వస్తూత్పత్తులపై అధికంగా టారిఫ్‌లు వేస్తున్నాయని దుయ్యబట్టారు. గతంలోనూ ‘ఇండియా టారిఫ్ కింగ్’ అని ట్రంప్ మండిపడ్డ విషయం తెలిసిందే. ప్రధాని మోదీతో కూడా అధిక టారిఫ్‌లపై నేరుగానే ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.