పాకిస్తాన్ – పంజాబ్ బోర్డర్‌లో పెద్దఎత్తున డ్రగ్స్, గన్స్ పట్టుబట్టాయ్. డ్రోన్స్ ద్వారా డ్రగ్స్, ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న మత్తు గ్యాంగ్‌కి చెక్ పెట్టారు పోలీసులు.. పంజాబ్‌లో కొనసాగుతున్న మాదకద్రవ్యాల వ్యతిరేక డ్రైవ్ సరిహద్దు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికి కొత్త వ్యూహాలను రూపొందిస్తున్న పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐని దెబ్బతీసిందని డిజిపి గౌరవ్ యాదవ్ సోమవారం అన్నారు.
పంజాబ్‌లో డ్రగ్స్‌పై యుద్ధం కొనసాగుతోంది. మత్తు బ్యాచ్‌పై ఉక్కుపాదం మోపుతోంది అక్కడి ప్రభుత్వం. సీఎం భగవంత్ మాన్ ఆదేశాలతో ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు పోలీసులు. అణువణువూ జల్లెడ పడుతూ డ్రగ్ పెడ్లర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. డ్రగ్ పెడ్లర్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయడంతోపాటు.. పెద్దఎత్తున మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల యాక్షన్‌కి ఇప్పటికే తోక ముడిచింది మత్తు గ్యాంగ్. మత్తు మ్యాచ్‌ని కటకటాల వెనక్కి నెట్టడంతో డ్రగ్స్ స్పీడ్ కొంతమేర తగ్గింది. పోలీస్ ఆపరేషన్‌తో తోకముడిచిన మత్తు గ్యాంగ్.. కొత్తకొత్త మార్గాలను వెదుక్కుంటోంది.
పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ ద్వారా డ్రగ్స్, ఆయుధాలను తెప్పించుకుంటోంది. అయితే, ఈ రాకెట్‌ను కూడా ఛేదించారు పోలీసులు. స్పెషల్ ఆపరేషన్ చేపట్టి.. ఈ డ్రగ్ స్మగ్లింగ్ ముఠా ఆట కట్టించారు. పాకిస్తాన్ బోర్డర్‌లో డ్రోన్స్ ద్వారా డ్రగ్స్, ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే, అరెస్ట్ సమయంలో పోలీసులపైకి కాల్పులు జరిపింది మత్తు గ్యాంగ్. దాంతో, పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు నిందితులకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆ తర్వాత నలుగురు నిందితుల నుంచి మూడు ఆయుధాలు, క్యాట్రిడ్జ్‌లు, ఏడు కేజీల ఓపీయం, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
మూడు నెలల్లో పంజాబ్‌ను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలన్నది ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ టార్గెట్. అందుకు అనుగుణంగానే డ్రగ్స్‌పై యుద్ధం పేరుతో స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు పోలీసులు.
పంజాబ్‌లో కొనసాగుతున్న మాదకద్రవ్యాల వ్యతిరేక డ్రైవ్ సరిహద్దు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికి కొత్త వ్యూహాలను రూపొందిస్తున్న పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐని దెబ్బతీసిందని డిజిపి గౌరవ్ యాదవ్ సోమవారం అన్నారు. రాష్ట్రంలో శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన నొక్కి చెప్పారు
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.