యుద్ధవిమానం అక్కడ భయబ్రాంతుల్ని చేసింది..
కాలిఫోర్నియాలో ‘మార్చ్ ఎయిర్ రిజర్వ్ బేస్’ బయట ఉన్న ఒక గోదాములో గురువారం ఎఫ్-16 యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది. కానీ సరిగ్గా ప్రమాదానికి ముందు పైలట్ విమానం నుంచి దూకేశాడు. పైలెట్ కి ఎలాంటి గాయాలు కాలేదని బేస్ పౌర వ్యవహారాల డైరెక్టర్ మేజర్ పెర్రీ కోవింగ్టన్ చెప్పారు. లాస్ ఏంజెల్స్ నుంచి సుమారు 105 కిలోమీటర్ల తూర్పున ఉన్న భవనం లోపల పైకప్పుకి పెద్ద రంధ్రం ఏర్పడటాన్ని స్థానిక టీవీ వార్తల్లో చూపించారు.
👉ఆ వీడియో లో:
మొబైల్ లో చిత్రీకరించిన దృశ్యాలు, వీడియోల్లో విమానం వెనక భాగం వెనక్కి తిరిగి కనిపించింది. కార్డు బోర్డు బాక్సులు చెల్లాచెదురై కనిపిస్తున్నాయి. విమానం వస్తున్న పోతున్న శబ్దాలు వినిపించాయని, ప్రమాదానికి ముందు మాత్రం పెద్ద శబ్దం వచ్చిందని గోదాములో పనిచేసే వారిలో ఒక కార్మికుడైన డేనియల్ గాలోగోస్ తెలిపారు.
👉ప్రమాదానికి కారణం :
పరిమిత శిక్షణ పొందిన పైలెట్ ల్యాండింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్టు మార్చ్ ఎయిర్ రిజర్వ్ బేస్ అధికారులు చెప్పారు. హైడ్రాలిక్ వ్యవస్థలో ఆటంకాలు రావడంతో పైలెట్ విమానంపై నియంత్రణ కోల్పోయినట్టు వివరించారు. గోదాముకి సాధారణ నష్టం వాటిల్లిందని, ఎలాంటి భారీ అగ్ని ప్రమాదం జరగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.