బెంగళూరులో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఉద్యోగం పేరుతో అందమైన యువతులకు వల వేసి తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి దించుతున్న ముఠాను బెంగళూరు పోలీసులు చాక చక్యంగా పట్టుకున్నారు.
అమాయకపు అమ్మాయిలకు ఉద్యోగం ఆశచూపి వ్యభిచార కూపంలోకి దించారని సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ఆ యువతులను విడిపించారు. ఉద్యోగం కోసం వచ్చి వేశ్య గృహాల్లో ఇరుక్కు పోయిన 10మంది యువతులకు పోలీసులు విముక్తి కల్పించారు.
ఈ హైటెక్ వ్యభిచారంలో అందమైన అమ్మాయిల ఫొటోలను పంపి సెక్స్ రాకెట్ ను నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.‘లోకాంటో’ వెబ్ సైట్ లో యువతుల ఫొటోలను అప్ లోడ్ చేసి విటుల నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేసి అమ్మాయిలను వారి వద్దకే పంపుతున్నట్టు గుర్తించారు.
ఈ హైటెక్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న రాజాజీ నగర్ కు చెందిన కుమార్ భరత్ కుమార్ రఘు ప్రజ్వల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.