మొన్నటి వరకూ భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నా గాని ఎవరూ కూడా కోలుకున్న దాఖలాలు లేవు. అయితే ఇటీవల రెండు రోజుల నుంచి కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది కాస్తంత ఊరట నిచ్చే విషయమని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా 21 రోజులు పాటు లాక్‌డౌన్ మోడీ ప్రకటించారు. మందులేని ఈ వైరస్ నుండి తప్పించుకోవాలి అంటే ముందుగా వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా ఉండాలని అందుకే లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ పక్కాగా అమలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకున్నా భారతదేశం మొత్తం అత్యంత బాధ్యతాయుతంగా లాక్‌డౌన్ అనుసరించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా లాక్‌డౌన్ ఇద్దరు ముఖ్యమంత్రులు పక్కాగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న గాని మరోపక్క డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
దాదాపు ఈ నెల ఆఖరికి చాలా వరకు క్వారంటీన్‌కి వెళ్లిన వారికి విముక్తి లభిస్తుందని దేశవ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏప్రిల్ 7 నాటికి తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి విముక్తి చాలామందికి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏప్రిల్ 14 నాటికి భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం చాలావరకు తగ్గిపోతుందని…14 తర్వాత ఎటువంటి సమయంలో అయినా లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం వుంటుంది అంటూ జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.
మొత్తం మీద దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రజలంతా అనుసరిస్తున్న లాక్‌డౌన్ సరిగ్గా కొనసాగితే కనుక రాబోయే రోజుల్లో లాక్‌డౌన్ తీసివేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఇండియాకి వెంటవెంటనే గుడ్ న్యూస్ లు క్రమక్రమంగా వస్తున్నాయ్ అని చెప్పుకోవచ్చు. మరోపక్క అంతర్జాతీయ స్థాయిలో కూడా భారతదేశంపై చాలా దేశాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఉన్నాగాని కీలక టైంలో భారతీయులంతా ఒకటేనని రుజువు చేశారని…కరోనా వైరస్ యుద్ధంలో చాలా వరకు భారతీయులు గెలిచినట్లే అని చివరి వరకు యుద్ధం చేయాలని అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ నాయకులు వేడుకుంటున్నారు.