స్థూలకాయం సమస్య అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. బరువు
తగ్గాలనుకునే వారు ఆహారాన్ని తగ్గిస్తున్నారు.దీని వల్ల నీరసం వస్తుంది.శరీరబరువు తగ్గాలంటే రోజూ రెండు సార్లు మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు పోషకాహారనిపుణులు.
మజ్జిగలో శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు నీరసం రాకుండా శక్తిని ఇచ్చే గుణం
ఉంది. ఉదయం,సాయంత్రం రెండు గ్లాసుల మజ్జిగ తాగితే.. బరువు తగ్గుతారని చెబుతున్నారు. శరీరపు బరువును పెంచేనెయ్యి,తీపి పదార్థాలు, పెరుగు, మాంసం, వేపుడు కూరలు, నూనె వస్తువులు ముఖ్యంగా వేరుశనగ నూనె, దుంపకూరలు, మినుముతో చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. భోజనం చేసే ముందు గ్లాస్ మంచినీళ్లు తాగాలి దీనితో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తీసుకుంటారు.
రోజు పరగడుపున ఆరగ్లాసు గోరు వెచ్చని నీళ్ళలో రెండు స్పూన్ల తేనె వేసుకుని తాగినా..
శరీరబరువు అదుపులో ఉంటుంది.
మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. భోజనం చేసిన తర్వాత పదినిమిషాలపాటు నడవాలి.. మిరియాలు, అల్లం, ఉసిరికాయ, నిమ్మకాయ, జీలకర్ర, ధనియాలు, వాము, వీటిని ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. శరీరంలో కొవ్వు నిల్వలను అడ్డుకునే వీటిని చారు, కూర, పుదీనా చట్నీలలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చుని నిపుణులు సూచిస్తున్నారు.so ఫ్రెండ్స్ మజ్జిగ తాగండి..బరువు తగ్గండి.