ఐదవ అతిపెద్ద దేశంగా భారత్.. గత పదేళ్లలో జీడీపీ రెట్టింపు..!

భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది. కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. అనేక విషయాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ముందంజలోనే ఉంది. ఈ క్రమంలో FY25లో భారతదేశ GDP వృద్ధి గత 10 సంవత్సరాలలో రెట్టింపు అయింది. జర్మనీ, జపాన్ తర్వాత ప్రపంచంలో GDP పరంగా ఐదవ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది.

భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది. కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. అనేక విషయాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ముందంజలోనే ఉంది. ఈ క్రమంలో FY25లో భారతదేశ GDP వృద్ధి గత 10 సంవత్సరాలలో రెట్టింపు అయింది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 4.3 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) విడుదల చేసిన డేటాలో ఈ సమాచారం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడం వల్ల, భారతదేశ GDP 2025లో జపాన్, 2027లో జర్మనీ కంటే ముందు వరుసలో నిలవనుంది. IMF డేటా ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఇది విధాన సంస్కరణలు, బలమైన ఆర్థిక వృద్ధి కారణంగా పేర్కొంది.

గత 10 సంవత్సరాలలో భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తి (GDP)ని రెట్టింపు చేసి 105 శాతం వృద్ధిని నమోదు చేసిందని IMF డేటా తెలిపింది. 2015లో 2.1 ట్రిలియన్ డాటర్ల నుండి 2025లో 4.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గతంలో పోల్చితే, అదే కాలంలో అమెరికా 66 శాతం, చైనా GDP 44 శాతం పెరిగాయి. దీంతో, భారతదేశం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ (30.3 ట్రిలియన్ డాలర్లు), చైనా (19.5 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4.9 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (4.4 ట్రిలియన్ డాలర్లు) తర్వాత ప్రపంచంలో GDP పరంగా ఐదవ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. IMF డేటా ప్రకారం, గత దశాబ్దంలో జపాన్ GDP సున్నాగా పెరగడంతో, భారతదేశం త్వరలో జపాన్‌ను అధిగమించనుంది. గత దశాబ్దంలో యునైటెడ్ కింగ్‌డమ్ జీడీపీ 28 శాతం వృద్ధి చెందగా, ఫ్రాన్స్ జీడీపీలో 38 శాతం వృద్ధిని సాధించింది. 2015లో 2.4 ట్రిలియన్ డాలర్ల నుండి 2025 నాటికి 3.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 50 శాతం కంటే ఎక్కువ GDP వృద్ధిని సాధించిన ఇతర అగ్ర ఆర్థిక వ్యవస్థలు రష్యా (57 శాతం), ఆస్ట్రేలియా (58 శాతం), స్పెయిన్ (50 శాతం)గా ఉన్నాయి. భారతదేశ GDP వృద్ధిని అపూర్వమైన రేటుతో చూపిస్తున్న IMF డేటాను బిజెపి మంత్రి అమిత్ మాల్వియా తన అధికారిక X పోస్ట్ ద్వారా పంచుకున్నారు.

 

 


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading