IPL 2025 Ticket Booking Online : ఐపీఎల్ – ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22వ తేదీ నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ cricket క్రీడాభిమానులను అలరించనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. అనంతరం మార్చి 23వ తేదీన ఉప్పల్ వేదికగా హైదరాబాద్ – రాజస్థాన్ జట్ల మధ్య పోరు ఉండనుంది.
అయితే.. గత సీజన్‌లో విక్రయించినట్టే ఈసారి కూడా అధికారిక వెబ్‌సైట్ https://www.iplt20.com/ తో పాటు.. ఆన్‌లైన్ వేదికలైన పేటీఎం, బుక్ మై షో ద్వారా ఐపీఎల్ 2025 టికెట్లు విక్రయించే అవకాశం ఉంది. ఐపీఎల్ (Indian Premier League) మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది బీసీసీఐ. నిర్దేశిత ప్లాట్‌ఫామ్‌లలో ఐపీఎల్ మ్యాచ్‌లన్నింటికీ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 టికెట్లను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం..
- ఆన్‌లైన్ బుకింగ్ అనేది IPL టిక్కెట్‌లను పొందడానికి సులభమైన మార్గం. అభిమానులు ఈ టికెట్లను BookMyShow, Paytm, ఐపీఎల్ అధికారిక IPL వెబ్‌సైట్ (https://www.iplt20.com/) ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే IPL జట్ల అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి కూడా టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు.
- మొదట అధికారిక వెబ్‌సైట్ https://www.iplt20.com/ ఓపెన్ చేయాలి. తరువాత బై ఐపీఎల్ 2025 టికెట్ ఆన్‌లైన్ క్లిక్ చేయాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
- మ్యాచ్ మరియు వేదికను ఎంచుకోండి
- సీటింగ్ కేటగిరీని ఎంచుకోండి
- చెల్లింపును పూర్తి చేయండి
- క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఏదో ఒక పేమెంట్ విధానం ఎంచుకోవాలి. పేమెంట్ పూర్తయ్యాక టికెట్ జారీ అవుతుంది.
IPL 2025 Tickets: How to book offline
వ్యక్తిగతంగా ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడే వారి కోసం IPL టిక్కెట్లు స్టేడియం బాక్సాఫీస్ మరియు సంబంధిత రిటైల్ అవుట్‌లెట్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి. అభిమానులు టిక్కెట్‌లను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి సమీపంలోని ఆథరైజ్డ్ కౌంటర్‌ను సందర్శించడం ద్వారా తప్పనిసరిగా టికెట్లు పొందొచ్చు. అయితే తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (ఆధార్, పాన్ లేదా పాస్‌పోర్ట్ వంటివి) సమర్పించాల్సి ఉంటుంది. సీట్లను ఎంచుకుని, నగదు, కార్డ్ లేదా డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించి చెల్లించిన తర్వాత టికెట్ పొందొచ్చు. ఇక టికెట్ ధరలు ఆయా మ్యాచ్, ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.