గొడవ పడిన రోజా, నాగబాబు.. జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసిన రోజా: సెన్సేషనల్ వీడియో

Spread the love

Teluguwonders:

తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో జడ్జ్ స్థానంలో రోజా బదులుగా శేఖర్ మాస్టర్ కనిపించడంతో జబర్దస్త్ నుంచి రోజా తప్పుకుందని అంటున్నారు.

🔴ఖతర్నాక్ కామెడీ షో :

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యినప్పటి నుంచి జబర్దస్త్ హాట్ టాపిక్‌గా మారింది. బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ అంటే ముందుగా గుర్తొచ్చేది నాగబాబు, రోజా ఇద్దరే ఇద్దరు. ఆ ఇద్దరి నవ్వులే ఈ కామెడీ షోకి బలం . అయితే గత కొంతకాలంగా వీరు తరుచుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

👉ఈ నేపథ్యంలో నాగబాబు, రోజాల మధ్య జరిగిన గొడవ తాలూకు వీడియో సోషల్ మీడియా లో సెన్సేషన్‌గా మారింది. ఇంతకీ వీరిద్దరి మధ్య వచ్చిన గొడవేంటి?

😜’ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు’:

ప్రస్తుతం బుల్లితెరపై ఓ వీడియో హంగామా చేస్తోంది. ఆ వీడియోలో నాగబాబు, రోజా గొడవ పడుతూ కనిపించడంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఇది నిజమైన గొడవ కాదులెండి. ఎప్పటిలాగే బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచడంలో భాగంగా జరిగిన గొడవ. ‘ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు’ అనే ప్రోగ్రాం కోసం నాగబాబు, రోజా ఇలా గొడవ పడాల్సి వచ్చింది.

🔴టాపిక్ ఏంటంటే :

..నవ్వుపైనే అసలు గొడవ.. అట. దాని కోసమే రోజా, నాగబాబు వారిద్దరూ గొడవ పడబోతున్నారు. మాటల యుద్ధం జరుపుకోబుతున్నారు.

☺వీడియోలో అదే చూపించారు :

నా నవ్వు బాగుంటుందా.. లేక నీ నవ్వు బాగుంటుందా అంటూ నాగబాబు, రోజాల మధ్య జరుగుతున్న వార్ తాలూకు కొన్ని క్లిప్స్ ఈ వీడియోలో చూపించారు. అంతేకాదు ఈ వీడియోలో జబర్దస్త్ కమెడియన్లతో పాటు ప్రదీప్, రవి లాంటి వారి సందడి కూడా కనిపించింది.
వినాయక చవితి సందర్బంగా..

ప్రతీ పండగకు బుల్లితెరపై వినోదం పంచుతూ ఖుషీ చేస్తున్న ఈ స్టార్స్.. ఎప్పటిలాగే ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ‘ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు’ అనే ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రాంకి సంబందించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో ఈ వినాయక చవితికి ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు అని ఫిక్స్ అవుతున్నారు బుల్లితెర ఆడియన్స్.

💥జబర్దస్త్‌కి రోజా గుడ్ బై చెప్పనుందా:

మరోవైపు జబర్దస్త్‌కి రోజా గుడ్ బై చెప్పిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై అఫీషియల్ సమాచారం బయటకు రాకపోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *