Teluguwonders:
సౌత్ కొరియాకు చెందిన కియా మేడిన్ ఇండియా కారు లాంచ్ అయింది. కియా మోటార్స్ ఇండియా గురువారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మేడిన్ ఇండియా SUV కారును తీసుకు రావడం ద్వారా భారత ఆటోమొబైల్ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కియా సెల్టోస్ మూడి ఇంజిన్ ఆప్షన్స్ రూపంలో అందుబాటులో ఉంది. అయిదు వేరియంట్స్‌లలో ఇది లభిస్తోంది. దీని ధర రూ.9.69 లక్షల (షోరూమ్ ధర) నుంచి ప్రారంభమవుతోంది. టాప్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలుగా (షోరూమ్ ధర) ఉంది.
32,035 కార్లు బుకింగ్:
కియా తన ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఇక్కడి నుంచి డొమెస్టిక్, ఎక్స్‌పోర్ట్ కార్లను ఉత్పత్తి చేస్తుంది. 1.5 పెట్రోల్, 1.5 డీజిల్, 1.4 టర్బో పెట్రోల్ వేరియంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏడాదికి 3 లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దీనిని రెండింతలు చేయనున్నారు. ఇప్పటికే 32,035 మంది కార్లు బుక్ చేసుకున్నారని కియా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ అండ్ ప్రెసిడెంట్ మనోహర్ భట్ తెలిపారు.
కియా సెల్టోస్ కార్లను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 206 సేల్స్ పాయింట్స్ ద్వారా కూడా బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. డొమెస్టిక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీవ్ర ఆర్థికమాంద్యంలో ఉన్న పరిస్థితుల్లో కియా కార్లు లాంచ్ అవుతుండటం గమనార్హం. ఆటో పరిశ్రమలో మందగమనం రెండు దశాబ్దాల దారుణ పరిస్థితికి చేరుకుంది.
ప్రతి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల మధ్య ఓ కొత్త కారును లాంచ్ చేయడం ద్వారా మార్కెట్‌ను విస్తరించుకోవాలని కియా చూస్తోంది. 2021 వాటికి 5 వెహికిల్స్‌ను తీసుకు రానుంది. కియా 160 నగరాల్లో టచ్ పాయింట్స్ ఉన్నాయి. 2021 వరకు 350 టచ్ పాయింట్స్ టార్గెట్‌గా పెట్టుకుంది. ఆపరేషన్స్ స్టార్ట్ చేసే సమయంలో ఇంత ఎక్కువ రిటైల్ బేస్ ఉండటం ఇదే మొదటిసారి.
మంచి స్టైల్, సూపర్ లుక్‌తో కియా సెల్టోస్ ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. కారు ముందు భాగంలో టైర్ నోస్ గ్రిల్, హార్ట్ బీట్ డీఆర్ఎల్స్‌తో కూడిన ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఐస్ క్యూబ్ ఆకారంలోని ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. కారు బ్యాక్ సైడ్ టెయిల్ లైట్స్, రూఫ్ రెయిల్స్, రూఫ్ స్పాయిలర్, పదిహేడు అంగుళాల క్రిస్టల్ కట్ అల్లాయ్స్ సహా పలు ప్రత్యేకతలు ఉన్నాయి. కియా సెల్టోస్‌లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. యువివో కనెక్టివిటీ సిస్టమ్‌తో కూడిన 10.25 ఇంచుల టచ్ స్క్రీన్, ఏడు ఇంచుల కలర్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 360 డిగ్రీస్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి.