*అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు*
రాంచీ: అంతర్జాతీయ క్రికెట్‌కు భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు ప్రకటించారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ధోనీ వెల్లడించారు. టీ20, వన్డే ఫార్మాట్లలో భారత్‌కు ధోని వరల్డ్ కప్ అందించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌పై 2004లో ధోనీ వన్డే అరంగేట్రం చేశారు.
డిసెంబరు 23 2004లో ధోనీ తొలి వన్డే ఆడారు. శ్రీలంకపై ధోనీ టెస్టు అరంగేట్రం చేశారు. 2005 డిసెంబరు 2 తన తొలి టెస్టు మ్యాచ్‌ను ధోనీ ఆడాడు.
ఈ మేరకు రిటైర్మైంట్‌పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయాలను ధోని పంచుకున్నాడు.