ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతీ నదుల సంగమ ప్రదేశంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. తెల్లవారుజామున నుంచే హర హర మహాదేవా.. శంభో శంకరా అంటూ పవిత్ర సాన్నిహిత్యాలు ఆచరించి భక్తి కరమైన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల వరకూ 1.32 కోట్ల మంది పుణ్య స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా లో 45 రోజుల్లో 65 కోట్లకు పైగా భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారని అంచనా వేసింది. కుంభమేళా ముగింపు సందర్భంగా భక్తులపై హెలికాప్టర్ల ద్వారా 20 క్వింటాళ్ల గులాబీ పూల వర్షం కురిపించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.