సాధారణంగా క్రికెట్ ఆటగాళ్లకి కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. 👉సచిన్ కి ఉన్న మూఢనమ్మకం ; టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కి వెళ్లేప్పుడు.. తన ఎడమ ప్యాడ్ కట్టుకున్నాకే.. కుడి ప్యాడ్ కట్టుకొనే వాళ్లు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్క మూఢనమ్మకం సహజంగా ఉంటుంది. దానికి మాహీ కూడా మినహాయింపు కాదు.మాహీ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది ఇష్టపడే క్రికెటర్లలో ఒకడు అయిన ఎంఎస్ ధోనీ . అతని క్రేజ్ కి నిదర్సనం అతనికి ఉన్న అతి పెద్ద ఫ్యాన్ ఫాలొయింగే. కెప్టెన్‌గా భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్‌కు అందించిన ధోనీ.. టీం ఇండియాకు దక్కిన అతి గొప్ప కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి 15వేల పరుగులు చేసిన ధోనీ.. ప్రస్తుతం ఐసీసీ ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్నాడు.
👉ధోని కీ ఒక మూఢ నమ్మకం ఉంది :
ఇక అసలు విషయానికొస్తే.. తనకూ ఓ మూఢ నమ్మకం ఉందని ధోనీ ఇటీవల వెల్లడించాడు. ‘‘చాలా మంది క్రికెటర్లకు మూఢనమ్మకాలు ఉంటాయి. అది సహజం. కుడి కాలు ముందు పెట్టాలా.. లేక ఎడమకాలా.. ఇలా చాలా విషయాలను నమ్ముతారు. నేను కూడా అలాంటివాడినే. మైదానంలో ఆడేందుకు వెళ్తున్నప్పుడు నేను ఎడమకాలు ముందు పెట్టి వెళ్తాను’’ అని ధోనీ ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించాడు.
‘‘నాకు చాలా అప్షన్లు ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు. కానీ రెండే ఉంటే తికమక పడతాను. ఇండియాలో ఆడిన 32 లేక 33 మ్యాచుల్లో నేను 29 సార్లు టాస్ ఓడిపోయాను. ఇలా జరిగిన ప్రతీసారి వచ్చే మ్యాచ్‌లో నా ఎంపిక మార్చుకునేవాడిని. ఇక ఐపీఎల్‌లో అయితే గత మ్యాచ్‌లో నేను ఏం ఎంచుకున్నానో.. వచ్చే మ్యాచ్ వరకూ మర్చిపోయేవాడిని’’ అని ధోనీ అన్నాడు.