అవును ఆ నాయకురాలను చూసి కార్యకర్తలు పరుగెత్తారు. వివరాల్లోకి వెళితే

Spread the love

ఆవిడ మరెవరో కాదు,పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఆమె అంటే అక్కడి నాయకులకు సింహస్వప్నం . అందరికీ చచ్చేంతా భయం. ఆమె వస్తుందంటే చాలు అధికారులంతా అలర్ట్ అయిపోతారు.  ఇక ప్రతిపక్ష నేతలకు అయితే ఆమె అంటే వణుకు. బయటకు మమతపై విమర్శలు గుప్పించినా.. ఆమె ఎదురు పడతే మాత్రం silent అయిపోతారు. ఇలాంటి ఓ ఆసక్తికర ఘటనే బెంగాల్‌లో చోటుచేసుకుంది. మమతా బెనర్జీ ముందు కుప్పిగంతులు  వేయబోయారు కొంత మంది బీజేపీ కార్యకర్తలు. వీళ్లహడావుడి చూసి కారు నుంచి ఆమె బయటకు దిగారు. దీంతో మమతను చూసి భయంతో పరుగు లెత్తేశారు బీజేపీ కార్యకర్తలు. వెస్ట్ మిడ్నాపూర్ లో ఈ ఘటన జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే : మమతా బెనర్జీ కాన్వాయ్ వెళుతుండగా, బీజేపీ జెండాలతో రోడ్డుపై కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడిన కొందరు ‘జై శ్రీరామ్… జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో మమత ఆగ్రహంతో, కారును అక్కడ ఆపమన్నారు. కారు డోర్ తీసి కిందకు దిగారు. ఆమె వేగంగా దిగడాన్ని చూసిన బీజేపీ కార్యకర్తలు అక్కడ్నుంచి పరుగు తీశారు. ఎందుకు పారిపోతున్నారని మమత వారిని అడిగినా ఎవరూ కూడా ఆగలేదు. ఇలా రండి అంటూ సీఎం పిలిచినా దగ్గరకు రాలేదు. వీళ్లంతా చాలా తెలివైనవారని, తన నుంచి తప్పించుకున్నారని వ్యాఖ్యానించిన ఆమె, ఆపై తన ప్రచారాన్ని కొనసాగించారు.

అయితే ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. జై శ్రీరామ్ నినాదాలు వింటే మమతకు కోపమెందుకని ప్రశ్నించింది. అవేమైనా వినకూడని పదాల అన్నట్లు మమత ఎందుకు ప్రవర్తిస్తున్నారని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరి మమత ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *