Teluguwonders:
గతేడాది ఆగస్టులో రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణకు తెలుగు తిథుల ప్రకారం ఆదివారం ప్రథమ వర్థంతి రావడం తో… నారా, నందమూరి కుటుంబాలు నివాళులు అర్పించాయి .
🔵చంద్రబాబు పరామర్శ :
సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఆదివారం హరికృష్ణ నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో పాటూ కుటుంబ సభ్యులు.. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. హరికృష్ణ గతేడాది ఆగస్టు 29న కన్నుమూశారు. కానీ తెలుగు తిథుల ప్రకారం ఆయన వర్థంతిని కుటుంబ సభ్యులు ఆదివారం నిర్వహించారు.
💥గతేడాది ఆగస్టు 29న :
నల్గొండ సమీపంలోని అన్నేపర్తి దగ్గర హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. హరికృష్ణ ప్రాణాలు కోల్పోగా.. అదే కారులో ఉన్న మరో ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో హరికృష్ణ స్వయంగా కారు నడుపుతున్నారు.
💥హరికృష్ణ :
రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యుడిగా, రాజ్య సభ సభ్యుడిగా పనిచేశారు. 1995 లో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడి అధికార మార్పిడి జరిగినప్పుడు తండ్రికి వ్యతిరేకంగా చంద్రబాబును సమర్ధించి క్రియాశీలక పాత్ర పోషించారు. 1995లో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో హరికృష్ణకు రవాణాశాఖ కేటాయించారు. కానీ ఆరు నెలల్లో ఆయన ఎక్కడా శాసనసభకు పోటీచేయలేక పోవడంతో ఆ పదవి వదులుకోవాల్సి వచ్చింది. 1996లో ఎన్. టి. ఆర్ మరణంతో హిందూపురం అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానంలో హరికృష్ణ పోటీ చేసి గెలిచారు. కానీ మంత్రి పదవి చేపట్టలేదు. 1999లో చంద్రబాబుతో విబేధించి అన్న తెలుగుదేశం పేరుతో మరో పార్టీ స్థాపించారు. కానీ కొద్ది రోజులకు మళ్ళీ తెలుగుదేశంలో చేరారు. 2008లో మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చా రు .అదే సంవత్సరం ఆయనను తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా సిఫారసు చేసింది. అప్పటి నుంచి మరణించే వరకు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.
👉 ఆగస్టు 22, 2013 లో రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.