92 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెలిస్‌లో వైభవంగా జరుగుతోంది. ఈ ఏటి ఉత్తమ నటుడిగా జాక్వీన్ ఫీనిక్స్ ఆస్కార్ సాధించారు. జోకర్ చిత్రంలో అత్యద్భుత నటనకు గానూ జాక్వీన్‌కు ఈ అవార్డు లభించింది.
ఉత్తమ నటిగా రెనె జెల్వెగర్ విజేతగా నిలిచారు. ఈ విభాగంలో మొత్తం ఐదుగురు నామినేట్‌కాగా జుడీ గార్లాండ్ చిత్రంలో అత్యుత్తమ నటన కనబర్చినందుకుగానూ రెనె జెల్వెగర్‌కు ఈ అవార్డు లభించింది. గతంలో ఆమె కోల్డ్ మౌంటైన్ చిత్రానికి గానూ ఉత్తమ సహాయనటి క్యాటగిరిలో కూడా అవార్డు సాధించారు.
ఉత్తమ సహాయ నటుడు విభాగంలో బ్రాడ్ పిట్ విజేతగా నిలిచారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో ఆయన నటనకు గానూ ఈ అవార్డ్ లభించింది. ఓ నటుడిగా ఆస్కార్ సాధించడం బ్రాడ్ పిట్ కెరియర్లో ఇదే మొదటి సారి కావడం విశేషం. తాను సాధించిన ఈ అవార్డ్‌ను తన పిల్లలకు అంకితమిస్తున్నట్టు పిట్ వేదికపై ప్రకటించారు.
ఈ ఏడాది ఉత్తమ సహాయ నటి విభాగంలో లారా డెర్న్ విజేతగా నిలిచారు. మ్యారేజ్ స్టోరీ చిత్రంలో ఆమె నటనకుగానూ ఈ అవార్డ్ లభించింది.
ఇక బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఒబామా ప్రొడక్షన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించిన అమెరికన్ ఫ్యాక్టరీ విజేతగా నిలిచింది.
ఉత్తమ దర్శకునిగా పారాసైట్ చిత్రానికి దర్శకత్వం వహించిన బొంగ్ జూన్ హొ విజేతగా నిలిచారు. పారాసైట్ చిత్రానికి అప్పటికే బెస్ట్ ఇంటర్నేషనల్ క్యాటగిరిలో అవార్డ్ రాగానే ఇక చాలు అనుకున్నానని, కానీ దర్శకత్వ విభాగంలో కూడా అవార్డ్ వస్తుందని అనుకోలేదని అవార్డ్ ప్రకటించిన అనంతరం బొంగ్ జూ హో అన్నారు.
ఈ ఏడాది విజేతలు వివరాలు ఇలా ఉన్నాయి.
- బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే
చిత్రం – జో రబ్బిట్
దర్శకుడు – తైకా వైటిటీ
- బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే చిత్రం – పారాసైట్
దర్శకులు -బాంగ్ జూన్ హొ & హాన్ జిన్ వన్
- బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ చిత్రం – టోయ్ స్టోరీ
బెస్ట్ డాక్యుమెంటెడ్ ఫీచర్ – అమెరికన్ ఫ్యాక్టరీ
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – బార్బర లింగ్ & నాన్సీ హై
చిత్రం- వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలివుడ్
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – జాక్విలిన్ డ్యురన్
చిత్రం -లిటిల్ విమెన్
- బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్
చిత్రం – ది నైబర్స్ విండో
- బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ – లెర్నింగ్ టు స్కేట్ బోర్డ్ ఇన్ వార్ జోన్ (ఇఫ్ యు ఆర్ ఎ గర్ల్)
- బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ – డోనాల్డ్ సిల్వెస్టర్
చిత్రం- ఫోర్డ్ వెర్సెసె ఫెరారీ
- బెస్ట్ సౌండ్ మిక్సింగ్
చిత్రం – 1917 – మార్క్ టేలర్ & స్టువర్ట్ విల్సన్
- బెస్ట్ సినిమాటోగ్రఫీ -1917
- బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్
చిత్రం – ఫోర్డ్ వెర్సెస్ ఫెరారీ – మైఖేల్ మెక్ క్యుసెకెర్, అండ్రు బక్లండ్
- బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్
చిత్రం -1917
- బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్
చిత్రం – పారాసైట్ (దక్షిణ కొరియా)
- బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – రాకెట్ మ్యాన్
- బెస్ట్ ఒరిజినల్ సోర్స్ – జోకర్
Source:BBC/telugu