పల్లెటూరి కథ
పల్లెటూరిలో సంప్రదాయాలు అన్ని పాటిస్తూ ఉంటారు. పూజలు కూడా బాగా చేస్తారు. జనాభా తక్కువ ఉంటారు అనే కానీ !!! ఉన్నంతలో సంతోషంగా ఉంటారు. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే ముందు కష్ట పడదాము. ఆ తరువాత మన కష్టానికి తగిన ఫలితం వస్తుంది అని అనుకుంటూ ముందుకు వెళ్తారు. పల్లెటూరిలో జనాభా లేకపోయినా కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టణం వాళ్ళు పల్లెటూరికి వస్తే అంత తేలికగా పల్లెటూరిని వదిలి వెళ్ళరు. పట్టణం వాళ్ళు సెలవుల సమయంలో పల్లెటూరికి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళరు. అంతలా ఆకట్టుకుంటాయి .
పల్లెటూరికి అందం పొలాలు, రైతులు. ఇంకా చెరువులు ,చిన్న కాలువలు కూడా ఉంటాయి. పల్లెటూరిలో రైతులు చాలా కష్ట పడుతుంటారు. పిల్లలు ఆడుకోవడానికి ఖాళీ ప్రదేశాలు కూడా చాలా ఉంటాయి. చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ళ వరకు సరదాగా ఉంటారు . పల్లెటూరిలో ఉన్నట్టు పట్టణంలో ఉండదు. పల్లెటూరి వాళ్ళు పట్టణంలో ఉండాలంటే కొంచం ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు అన్ని చోట్ల ఉండలేరు. పట్టణం వాళ్ళు ఎక్కడికి వెళ్లినా సర్దుకు పోతారు. ఎందుకంటే పట్టణంలో ఉండే వాళ్ళు ఇరుకుగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఇలాంటి వాళ్ళు పల్లెటూరిని బాగా ఇష్టపడతారు. ఇంత వరకు చూడని వాళ్ళు ఒక్కసారి వెళ్లి పల్లెటూరిని చూడండి.
పట్టణం వాళ్ళు కోట్లు సంపాదించిన ఆనందంగా ఉండలేరు. ఆనందం కోసం వెతుక్కుంటారు. పల్లెటూరి వాళ్ళు కోట్లు సంపాదించక పోయిన కానీ సంతోషంగా ఉంటారు. వాళ్ళు కోట్లు సంపాదించక పోవచ్చు. కోట్లాది ప్రజలు తినడానికి కావలసిన ఆహారాన్ని పండిస్తున్నారు. వాళ్ళు ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు అలా చెప్పుకోరు. పల్లెటూరి వాళ్ళు కదా తగ్గి ఉంటారు. వాళ్ళకి ఎక్కడ తగ్గాలో ? ఎక్కడ నెగ్గాలో తెలుసు.
వాళ్ళు వాళ్ళ కోసమే కాకుండా అందరి కోసం కష్ట పడతారు. వాళ్ళని గౌరవించండి.