Latest

వచ్చే నెల 15న ఏపీకి ప్రధాని మోదీ.. రాజధాని పునః ప్రారంభ పనులకు శ్రీకారం.

Spread the love

ఏఫ్రిల్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రాజధాని పునః ప్రారంభ పనులకు హాజరుకానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ర్టంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

ఏఫ్రిల్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రాజధాని పునః ప్రారంభ పనులకు హాజరుకానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ర్టంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా మరొక్కసారి దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. రాజధాని పనులు మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు రచించింది.

40 వేల కోట్ల రూపాయల పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచింది ప్రభుత్వం. ప్రజాధనంతో రాజధానిని నిర్మించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అమరావతి స్వయం పోషక ప్రాజెక్టు అని చెప్తోంది. 2015 అక్టోబర్ 21న అమరావతికి ప్రధాని మోదీ తొలిసారి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా మరోసారి పున:ప్రారంభ పనులకు తేదీని ఖరారు చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునఃప్రారంభానికి సిద్దం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 15న అమరావతి పర్యటనలో పాల్గొని, రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పునఃప్రారంభం ద్వారా రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి, సీఆర్‌డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఇప్పటికే సమగ్ర ప్రణాళికను రూపొందించింది. మొత్తం రూ.62,000 కోట్ల అంచనా వ్యయంతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading