గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ 16 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో చరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. మార్చి 27న (నేడు) చరణ్ బర్త్ డే కావడంతో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ చరణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా దూసుకుపోతున్నాడు. నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు. సినిమా సెలబ్రెటీల దగ్గర నుంచి మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రామ్ చరణ్ సినీ జర్నీ విషయానికొస్తే 2007లో “చిరుత” సినిమాతో ప్రారంభమైంది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా. ఈ సినిమా మిశ్రమ స్పందనలు పొందినప్పటికీ, రామ్ చరణ్ ఎనర్జీ, డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత 2009లో వచ్చిన “మగధీర” సినిమా చరణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది అలాగే రామ్ చరణ్‌ను స్టార్ హీరోగా మార్చేసింది. ఈ సినిమాలో చరణ్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు, కాజల్ అగర్వాల్‌తో కెమిస్ట్రీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
ఆ తర్వాత “రచ్చ” , “నాయక్” , “ధృవ” వంటి సినిమాలతో కమర్షియల్ విజయాలు సాధించాడు. “రంగస్థలం” (2018) సినిమాలో గ్రామీణ నేపథ్యంలో చిట్టిబాబు పాత్రలో తన నటన అభిమానులను, విమర్శకులను కట్టిపడేసేలా చేసింది. ఈ సినిమాచెర్రీకి ఉత్తమ నటుడిగా అనేక అవార్డులను తెచ్చిపెట్టింది. ఇక రామ్ చరణ్ కెరీర్ లో అతిపెద్ద విజయం 2022లో వచ్చిన “ఆర్‌ఆర్‌ఆర్” సినిమాతో సాధ్యమైంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ నటన అద్భుతం అనే చెప్పాలి. ఎన్టీఆర్ తో పోటీపడి నటించారు ఈ గ్లోబల్ స్టార్. ఈ సినిమా ఆస్కార్‌తో సహా అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. నటనతో పాటు, రామ్ చరణ్ నిర్మాతగా కూడా కొన్ని ప్రాజెక్ట్‌లలో అడుగుపెట్టాడు. చరణ్ చివరిగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సి 16 చేస్తున్నాడు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.