కరోనా వైరస్ వల్ల ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆర్ధిక వ్యవస్థను సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు పారిశ్రామిక వేత్తలు కొత్తగా ఆలోచించాలంటున్నారు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను స్వీకరించి నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక వేత్తలను ఉద్దెశించి సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు రతన్ టాటా.
అందరూ ఓ తెల్లకాగితం తీసుకుని ఇంతక ముందెన్నడూ ఊహించని కొత్త ఆవిష్కరణల కోసం మార్గాలను అన్వేషించడం మొదలు పెట్టాలి. మున్ముందు ఈ సంక్షోభం నుండి బయట పడాలంటే పారిశ్రామిక వేత్తలు ప్రస్తుత పరిస్థితులను స్వీకరించి సరికొత్త ఉత్పత్తులను సృష్టించక తప్పదని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మరింత సమర్ధవంతగా నిర్వహించేందుకు కనుకొనగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక గతంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు పారిశ్రామిక వేత్తలు ఇంతకు ముందెన్నడూ ఉనికిలో లేని వాటి గురించి ఆలోచించే వారని.. అవే ఈ రోజు నూతన ఆవిష్కరణలు టెక్నాలజి అందుబాటులోకి రావడానికి ప్రధాన కారణం అయ్యిందని అన్నారు. ఇలాంటి సామర్థ్యం ప్రస్తుత సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు సరికొత్త ఉత్పత్తిని ఆవిష్కరించేందుకు కంపెనీని నడిపేందుకు మరింత చక్కటి కార్యకలాపాలకు ఓ మార్గాన్ని నిర్మిస్తుందని ఆశిస్తున్నానని రతన్ టాటా అన్నారు.