భారత వ్యాపార రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న కంపెనీ ఏదయినా ఉంది అంటే అది రెలైన్స్ ల ఒక్కటే. ధీరు భాయి అంబాని ఏ ముహూర్తం లో స్టార్ట్ చేసారో కానీ ఇవాళ ఇండియా లో మార్కెట్ రంగాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా ప్రపంచ మార్కెట్ ని ప్రభావితం చేస్తూ షేక్ చేస్తుంది.ఈ కంపెనీ.ఆయిల్ , టెలికాం, రిటైల్ , లాజిస్టిక్, డిజిటల్, మీడియా, ప్రింట్ సోషల్ మీడియా.
ఒక్క టెలికాం రంగం లో గుత్తాధిపత్యం కలిగిన సంస్థ గా ప్రభుత్వ ఆధీనంలో భారత్ సంచార నిగం లిమిటెడ్ ఉండగా ప్రైవేట్ రంగ సంస్థ లు ఈ రంగంలో కి వచ్చాయి.ఒక్కో కంపెనీ ఒక్కో స్టైల్. బిఎస్ న ల్ , వొడాఫోన్ , ఎయిర్టెల్,ఐడియా ఇలా కంపెనీ లు టెలికాం రంగాన్ని శాసించాయి.
ఆఫర్లు తో వినియోగదారుల ను ఆకట్టుకుంటున్నాయి. ఐటి రంగం అభివృద్ధి చెందటం , టెక్నాలజీ డవలప్ కావడం ఇవన్నీ మరింత పరిపుష్టం చేశాయి. లక్షలాదిమంది కి ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉపాధి దొరికింది. కాని కోలుకోలేని దెబ్బ తీశారు అంబాని.
కేవలం 1000 రూపాయిలకే మొబైల్ ఫోన్ ఆఫర్ ప్రకటించారు. అప్పటిలో అదో సంచలనం. ప్రతి కంపెనీ రెలైన్స్ ని డీ కొనేందుకు ప్రయత్నాలు చేసారు. ఇండియా లోని వ్యాపారమంతా పల్లెలో ఉంటుంది. ఈ విషయాన్నీ గమనించిన రెలైన్స్ ఏకంగా….చిరు వ్యాపారుల ను టార్గెట్ చేసింది.సదరు కంపెని వ్యవసాయ రంగం మీద పడనందుకు ఆనందపడాలి మనమంతా.