టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ రాబిన్ హుడ్. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి.
యంగ్ హీరో నితిన్ హిట్ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. భీష్మ సినిమా తర్వాత నితిన్ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు. కాగా ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. నేడు ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ తో పాటు డేవిడ్ వార్నర్ కూడా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే పడటంతో సినిమా రివ్యూను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉందో తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.
గతంలో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో భీష్మ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి థియేటర్స్ లో మరోసారి నవ్వులు పూయించారని అంటున్నారు అభిమానులు. నితిన్ బ్లాక్ బస్టర్ కొట్టాడని , నితిన్, రాజేంద్రప్రసాద్, వెన్నెలకిషోర్ కాంబోలో వచ్చే కామెడీ సినిమా మాత్రం బాగా నవ్విస్తాయని చెబుతోన్నారు, కామెడీ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.