ఆర్టీసీ కార్మికులకు జగన్ గుడ్ న్యూస్..మాట నిలబెట్టుకున్న ఏపీ సీఎం

Spread the love

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వాళ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది… ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. దీంతో జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు.  52వేల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఆర్టీసీ విలీనం బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో…కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చట్టం తెస్తున్నామని.. ఇకపై ప్రజారవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం చేస్తామని పేర్కొంటూ ఆర్టీసీ విలీనం బిల్లును అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. 1997లో చంద్రబాబు నాయుడు తెచ్చిన చట్టం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో కలిపేందుకు అడ్డంకిగా మారిందని – అందుకే  ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్త చట్టం తెచ్చామన్నారు. జనవరి 1లోపు ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. కొత్త చట్టం తెచ్చామని మంత్రి వివరించారు. విలీనానికి బోర్డు కూడా అంగీకారం తెలిపిందన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ….ఆర్టీసీ గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కార్మికుల ఉద్యోగభద్రత కోసమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల ఉద్యోగభద్రత కోసమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల కోసం రూ.3600 కోట్లను ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి కొత్తగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. చర్చ అనంతరం శాసనసభ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది… దీంతో 2020 జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 52 వేల మంది ఆర్టీసీ కార్మికులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *