దేవినేని నెహ్రూ పాత్ర లో..‘బెజవాడ సింహం’గా ఎన్టీఆర్ కొత్త చిత్రం ప్రారంభం…

Spread the love

అవును ఎన్టీఆర్ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఇక్కడ ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామాారావు కాదు..నందమూరి తారకరత్న..తారక రత్న పేరుతో ఎన్ని సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ పేరు లో ఉన్న క్రేజ్ అయినా తనకు కలిసి వస్తుందేమో అని తన పేరు నందమూరి .తారక రత్న పేరును brief గా ఇతను షార్ట్‌కట్‌ చేసి ఎన్టీఆర్‌గా మార్చుకున్నాడు.

👉తాజాగా నందమూరి కథానాయకుడు దేవినేని నెహ్రూ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘దేవినేని’ టైటిల్సి‌తో తెరకెక్కుతోన్న సినిమాలో దేవీనేని నెహ్రూ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మధ్య బయోపిక్ ల సందడి టాలీవుడ్లో గట్టిగా ఊపందుకుంది. ‘బెజవాడ సింహం’ అనే ట్యాగ్‌లైన్ తో,దేవినేని టైటిల్ గా తాజాగా ఈసినిమా పూజా కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగాయి. ఆర్టీఆర్ ఫిలింస్ పతాకంపై నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు)ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. రాము రాథోడ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈసినిమాలో ఎన్టీఆర్ అలియాస్ తారకరత్న తో పాటు నాగినీడు, నాజర్,జయప్రకాష్ రెడ్డి,బెనర్జీ,శివారెడ్డి,పృథ్వీ,సుహాసిని, అన్నపూర్ణ,సుధ,అజయ్,శ్రీ హర్ష ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు మే 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్స్ చేసి దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

తారక రత్న తన పేరు మార్చుకున్నాడు బాగానే ఉంది..కానీ అది తన జాతకాన్ని మాత్రం మార్చలేక పోతుంది.చూద్దాం ఈ సినిమా అయినా కలిసి వస్తుందేమో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *