పొలాండ్ దేశ చరిత్రలోనే ప్రప్రథమం గా జరిగిన ఓ అద్భుతానికి ఆ దేశ అధ్యక్షుడు సంభ్రమాశ్చర్యలకు లోనయ్యారు.
👉విషయం ఏంటంటే : ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు శిశువులకు జన్మనిచ్చిన సంఘటన పోలాండ్ లో చోటుచేసుకుంది. ఓ మహిళకు ఒకే కాన్పులో ఆరుగురు శిశువులు జన్మించడం పోలాండ్ లో ఇదే తొలిసారి.
♦విశేషం : ఆ మహిళకు అప్పటికే రెండేళ్ల బాలుడు ఉండగా.. రెండో కాన్పులో ఒకేసారి ఆరుగురికి జన్మనివ్వడం విశేషంగా నిలిచింది. ఇందులో నలుగురు ఆడ, ఇద్దరు మగ శిశువులు ఉన్నా
👉వివరణ : సోమవారం క్రకౌ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఆ మహిళ ఆరుగురి పిల్లలకు జన్మనివ్వగా.. ఒక్కొక్కరు కిలో బరువు ఉన్నారు.
దీంతో వైద్యులు వారిని ఇన్‌క్యూబెటర్స్‌లో ఉంచారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. 29 వారాల గర్భవతైన ఆమెకు సిజేరియన్ చేసినట్లు యూనివర్సిటీ వైద్యులు పేర్కొన్నారు. ఇలా ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనివ్వడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు.
♦ ఆ దంపతులను కలుసుకున్న పొలాండ్ అధ్యక్షుడు” అండ్రుజేజ్ దుడ” ఆ దంపతులను ట్విటర్ వేదికగా అభినందించారు. 👉🎉ఆయన సంతోషం..ఆయన మాటల్లోనే :‘ “ఇది అబ్బురపరిచే వార్త.. పొలాండ్ దేశ చరిత్రలోనే తొలిసారి ఒకే కాన్పులో ఆరుగురు జన్మించడం. ఆ దంపతులకు అభినందనలు. వైద్యులకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. అధిక సంతానం వల్ల ఆ దంపతులకు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ దేశం మాత్రం సంతోషించింది..