నిత్యం ఈ సృష్టిలో అనేక అద్భుతాలు వింతలు చూస్తూ ఉంటాం మనకు తెలియని ఎన్నో వింత జీవులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి లేదా తెలిసిన జీవులే వింతగా కనిపిస్తూ ఉంటాయి..
అలాంటిదే ఈ 3 తలల పాము. బహుశా ఇలాంటి పామును ఎప్పుడూ చూసి ఉండరు.
👉ఎక్కడ గుర్తించారు : కార్పెట్ పైథాన్ అని పిలిచే ఈ పాము 40 సెం.మీ. పొడవు ఉందని తెలిపారు. ఈ అరుదైన పామును ఆస్ట్రేలియాలోని అర్న్‌హెమ్ హైవేపై మార్చి నెలలో గుర్తించారు.
♦సోషల్ మీడియా లో వైరల్ : నార్తర్న్ టెరిటరీ పార్క్స్ అండ్ వైల్డ్‌లైఫ్ ఈ మూడు కళ్ల పాము ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది.
👉 మూడో కన్ను ఏర్పడటానికి గల కారణాలు : పిండం అభివృద్ధి చెందుతున్న తొలినాళ్లలోనే పాముకు మూడో కన్ను ఏర్పడిందని భావిస్తున్నారు.
సహజమైన జన్యు పరివర్తనతో జన్మించిందని భావిస్తోన్న ఈ పాముకు తల పైభాగంలో ఉన్న మూడో కన్ను కూడా పని చేస్తున్న విషయాన్ని వైల్డ్‌లైఫ్ అధికారులు గుర్తించారు. ఇదండీ కార్పెట్ పైథాన్ కథ*