Teluguwonders:
అర్జున్ రెడ్డి సినిమాతో కెరీర్ ప్రారంభించింది హీరోయిన్ షాలినీపాండే. చిన్నతనం నుంచే హీరోయిన్ కావాలనే ఆశతో కెరీర్ ఆరంభించిన ఈ భామకు తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. దీంతో అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతాయని ఉహించారంతా. కానీ అనుకున్న రేంజ్‌లో ఛాన్సెస్ పట్టలేక పోయింది. దీంతో ఈమె కెరీర్ ఇక ముగిసినట్లే అనుకున్న ఈ సమయంలో బడా స్టార్ హీరోతో నటించే బంపర్ ఆఫర్ పట్టేసింది షాలినీ.
విజయ్ దేవరకొండతో రొమాన్స్.. ఆ వెంటనే
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండతో ఓ రేంజ్ రొమాన్స్ చేసి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది షాలినీ పాండే. దీంతో ఆ వెంటనే టాలీవుడ్ సహా ఇతర భాషా దర్శకనిర్మాతల చూపు షాలినీపై పడింది.
ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, 118 లాంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ అమ్మడికి ఆశించిన ఫలితం రాలేదు.
ఇక కష్టమే అనుకున్న తరుణంలో
షాలినీ వద్ద అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ ఫలితం మాత్రం అంతగా రాకపోవడంతో ఇక ఆమె కెరీర్ కష్టమే అనుకున్నారు ప్రేక్షకులు. ఇంతలోనే బాలీవుడ్ నుండి బంపర్ ఆఫర్ షాలినీ పాండేను వరించిందనే వార్త ఆమె అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. అదికూడా భారీ అని తెలుస్తుండటం ఒకరకంగా అందరికీ షాకిస్తోంది.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు చేయాలని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ షాలినీతో సంప్రదింపులు చేసినట్లు సమాచారం. పైగా ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ స్టార్ రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా ఆమెను నటించాలని కోరారట. ‘జయేశ్‌భాయ్ జోర్దార్’ అనే పేరుతో రాబోతున్న కొత్త సినిమాలో షాలినీ పాండేని ఫైనల్ చేసేశారట.
బడా స్టార్ హీరోతో కమిట్..
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ జంటగా ఆమె నటించనుండటం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి షాలినీ స్థానంలో మొదట సారా అలీఖాన్, అనన్యా పాండే వంటి స్టార్ కిడ్స్ పేర్లను పరిశీలించిన చిత్రయూనిట్.. చివరకు షాలినీ పాండే వైపే మొగ్గుచూపారట. ఇందుకు సంబందించిన అగ్రిమెంట్ కూడా జరిగిందని, త్వరలోనే ఆమె సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.