మహర్షి..సినిమా మైనస్ లు…

Spread the love

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు లేటెస్ట్ మూవీ ఇప్పుడు థియేటర్ లో ఉంది.result కోసం వెయిట్ చేస్తుంది. కాన ప్రీ రిలీజ్ టాక్ విషయం లోఇప్పటికే సినిమా గురించి ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో ఒక్క‌టే చ‌ర్చ‌. టీజ‌ర్, ఆడియో రెండూ అంచ‌నాలు అందుకోలేదు… క‌థ గొప్ప‌గా లేద‌ట‌… సినిమా స‌రిగా రాలేద‌ట‌.. ప్రి రిలీజ్ బిజినెస్‌లోనే టేబుల్ లాస్ అట‌… ఇలా చాలా మైనస్ లు మ‌హ‌ర్షి గురించి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఏదేమైనా ఓ సూప‌ర్‌స్టార్ సినిమాకు ఉండాల్సినంత హైప్ మ‌హ‌ర్షికి రాలేద‌న్న‌ది నిజం. ఇది ఒప్పుకుని తీరాలి.

గ‌తంలో బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ లాంటి రెండు డిజాస్ట‌ర్లు వ‌చ్చాక కూడా వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేను సినిమాకు అదిరిపోయే ప్రి రిలీజ్ బ‌జ్ వ‌చ్చింది. దాంతో పోలిస్తే ఇప్పుడు మ‌హ‌ర్షికి అంత సీన్ లేద‌న్న మాటే ఎక్కువుగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా బెనిఫిట్ షోల విష‌యంలో సందేహాలు కూడా నెల‌కొన్నాయ్‌. మ‌హేష్ ఫ్యాన్స్ మాత్రం 8వ తేదీ అర్ధ‌రాత్రి దాటాకే బెనిఫిట్ షోల కోసం కాచుకుని కూర్చొని ఉన్నారు. తెలంగాణ‌లో మాత్రం పెద్ద సినిమా బెనిఫిట్ షోల‌కు అనుమ‌తులు లేవు. ఇప్పుడు మ‌హ‌ర్షికి అదే ప‌ద్ధ‌తిలో అనుమ‌తులు క‌ష్టం అని తెలుస్తోంది.

ఏపీలో ఏకంగా అర్ధ‌రాత్రి నుంచే షోలు వేసుకోవ‌డంతో పాటు ఏకంగా వారం రోజుల పాటు ఆరు షోలు, తొలి వారం రోజులు టిక్కెట్ రేట్లు పెంచుకునే అనుమ‌తులు సులువుగానే వ‌స్తున్నాయ్‌. ఏపీలో హ్యాపీగా ఉద‌యం 3 , 4 గంట‌ల‌కు షోలు ప‌డిపోయాయి. 👉కానీ తెలంగాణ‌లో ఉద‌యం 8 లేదా 9 గంట‌ల‌కు గాని అనుమ‌తులు రాక‌పోవ‌చ్చు. మ‌హ‌ర్షి బెనిఫిట్ షోలు లేక‌పోవ‌డం తెలంగాణ అభిమానుల‌కు కాస్త డిజాప్పాయింటే.రిజల్ట్ తిప్పికొడితే ఆంధ్ర లో టాక్ తెలిసిన తెలంగాణ ప్రజలు..సినిమాకి వెళ్లకపోవచ్చు..చూద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *