ఉమైర్ సంధు తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇచ్చే విశ్లేషకుడు అనే సంగతి తెలిసిందే. చాలా తెలుగు సినిమాలకు ఆయన ఫస్ట్ రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ‘మహర్షి’ సినిమాకు ఆయన రివ్యూ, రేటింగ్‌ను వెల్లడించారు. యూఏఈ సెన్సార్ బోర్డులో సినిమా చూసిన ఉమైర్ సంధు.. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే రివ్యూ ఇచ్చేశారు.
👉సూపర్ స్టార్ మహేష్‌బాబు అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. మే 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘మహర్షి’.. యు/ఎ సర్టిఫికెట్ పొందింది.
దుబాయ్‌లో కూడా విడుదలవుతోన్న ఈ చిత్రం అక్కడ సైతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఇదిలా ఉంటే, అక్కడి సెన్సార్ బోర్డులో సభ్యుడిగా చెప్పుకునే సినీ విశ్లేషకుడు మహేష్‌బాబు సినిమాకు నాలుగు స్టార్లు వేసేశారు. ఇది మహేష్ బాబు అభిమానులకు చాలా సంతోషకరమైన వార్త ఇది.సంధు రివ్యూ మహేష్‌బాబు అభిమానులకు మంచి కిక్కిచ్చేలా ఉంది. విడుదలకు ముందే ఇలాంటి రివ్యూ మహేష్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు చేయడం ఖాయం.
అయితే, ఉమైర్ సంధు ఓ సినిమాకు నాలుగు స్టార్లు ఇవ్వడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సినిమాలకు ఆయన నాలుగు స్టార్లేసేశారు. వాటిలో కొన్ని హిట్టయితే.. మరికొన్ని ఫట్టయ్యాయి. మహేష్‌బాబు ‘స్పైడర్’ మూవీకి కూడా సంధు నాలుగు స్టార్ల రేటింగ్ ఇచ్చారు. ఆ సినిమా ఏమైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు.
🔅ఇంతకీ ఆయన రివ్యూ ఏమిటంటే :
‘ మహర్షి అన్ని అంశాల్లో అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం అని,మహేష్‌బాబు తన నటనతో అబ్బురపరిచారని, పూజా హెగ్డే కారెక్టర్ సినిమాలో ఆశ్చర్య పరుస్తుందని ,ఇది పక్క ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’ అని సందు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. కానీ అసలైన ఫలితం కోసం మే 9 ఉదయం వరకు వేచి ఉండాల్సిందే.