రిలీజ్ కు ముందే రికార్డ్స్ కు సై అంటున్న మెగా స్టార్

Spread the love

Teluguwonders:

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.

‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. రామ్ చరణ్ స్వీయ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో విడుదలయింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

💥 రికార్డులు మొదలెట్టేసిన ‘సైరా: నరసింహారెడ్డి’ :

భారీ బడ్జెట్‌తో వస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది చిత్ర యూనిట్. విడుదలకు తక్కువ వ్యవధి ఉండడంతో ఈ కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే 1.47 నిమిషాలున్న ‘సైరా’ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ 14వ తేదీన మధ్యాహ్నం 3.45 గంటలకు విడుదల చేసింది.

🔴వీడియోకు విశేష స్పందన :

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా కావడంతో ఈ వీడియోకు కొద్ది సమయంలోనే విశేష స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన గంటలోనే దాదాపు రెండు లక్షల వ్యూస్ సంపాదించింది. మిగిలిన సామాజిక మాధ్యమాలు అన్నీ కలిపి మొత్తంగా డిజిటల్ వ్యూస్‌లో ఈ వీడియో మిలియన్ మార్కును అందుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. దీనికి తోడు మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

👉మొదటి స్థానం లో సైరా :

సైరా నరసింహారెడ్డి ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా పడిపోయింది. ఇది ట్విట్టర్‌ ట్రెండింగ్‌తో సుస్పష్టమైంది. #SyeRaaMaking ఇండియాలోనే ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్స్ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకోగా, #SyeRaaNarasimhaReddy రెండో స్థానంలోనూ, #MegastarChiranjeevi, #RamCharan మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇలా ఒకే సినిమాకు సంబంధించిన నాలుగు ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉండడం అరుదనే చెప్పాలి.

💥రికార్డ్స్ బ్రేకింగ్ దిశగా మేకింగ్ వీడియో !!?

కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ‘సైరా: నరసింహారెడ్డి’ టీజర్ 24 గంటల్లోనే 7.1 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. తద్వారా అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సినిమా టీజర్ల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ రికార్డును మేకింగ్ వీడియో బద్దలు కొడుతుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం ఉన్న వేగం కంటిన్యూ అయితే అది సాధ్యమవుతుందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *