కల్కి..లో రాజశేఖర్..పవన్ కళ్యాణ్ పై సెటైర్స్ వేయబోతున్నాడా..

Spread the love

రాజశేఖర్ హీరోగా వ‌స్తున్న సినిమా క‌ల్కి.. గ‌రుడ‌వేగ సినిమాతో తానున్నాన‌ని నిరూపించుకున్న రాజశేఖర్.. ఇప్పుడు మ‌రో ప‌వ‌ర్ ఫుల్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు.ఈ సినిమా ట్రైలర్ చూసిన వారందరూ రాజశేఖర్ మరో హిట్ కొట్టబోతున్నాడు అంటున్నారు .”అ..” లాంటి experiment సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క‌ల్కి సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ వేగంగా జ‌రుగుతున్నాయి. అదాశ‌ర్మ‌, నందిత శ్వేత ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తొలి టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది.. కానీ ఈ సారి మాత్రం యాక్షన్ విత్ కామెడీ తీసుకొచ్చాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.

🔅హైలైట్స్ : భగవద్గీత శ్లోకం తో మొదలైన ట్రైలర్ ఆ తర్వాత రాజశేఖర్ చెప్పే “ఏం సేస్తిరి సేస్తిరి” అనే డైలాగ్.. 🔅రాజ‌శేఖ‌ర్ ఎదుటే రాజ‌శేఖ‌ర్ డాన్స్ ని ఇమిటేట్ చేసే గబ్బర్ సింగ్ లోని రాజశేఖర్ డూప్ క్యారెక్టర్ … ట్రైల‌ర్‌లో హైలైట్ అయ్యాయి. త్వ‌ర‌లోనే క‌ల్కి సినిమా విడుద‌ల కానుంది. 1983 నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది ఈ చిత్రం.
🔅పవన్ పై సెటైర్స్ : గబ్బర్ సింగ్ లోని అంత్యాక్షరి కార్యక్రమంలో రాజశేఖర్ ని
,రాజశేఖర్ డ్యాన్స్ ని ఇమిటేట్ చేసే ఒక ఫన్నీ సీన్ ఉంటుంది.ఆ సినిమా చూసిన వాళ్లెవ్వ‌రూ ఆ సీన్ ని అంత ఈజీగా మర్చిపోలేరు. అది ఆ సినిమాలో మంచి హైలెట్ అయ్యింది .ఆ సీన్ అప్పట్లో కొంచెం వివాదం కూడా అయింది. ఎందుకంటే ఆ సీన్ రాజశేకర్ ని కామెంట్ చేసినట్టు ఉందని చాలా మంది చూసిన వారు అభిప్రాయపడ్డారు. 🔅దానికి బదులుగా నే కల్కి సినిమాలో ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అదిరిపోయే సెటైర్లు వేశాడంట రాజ‌శేఖ‌ర్.ఇప్పుడు ఇదే అంత్యాక్షరి కామెడీని త‌న సినిమా కోసం వాడేసుకున్నాడని ఇండస్ట్రీ లోనూ, ఇంకా ట్రైలర్ చూసిన వారి టాక్..ఈయ‌న త‌న కొత్త సినిమా క‌ల్కితో గ‌బ్బ‌ర్ సింగ్‌నే టార్గెట్ చేసాడంటున్నారు .

👉దీనిలో పూర్తి నిజమెంతో సినిమా రిలీజ్ అయ్యేవరకు తెలియదు. ఒక వేళ అదే నిజమైతే..pk ఫ్యాన్స్ రాజశేఖర్ ని troll చేయడం ఖాయం.ఆటోమేటిక్ గా కలెక్షన్స్ పెంచడం కూడా ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *