మెగా ఫ్యాన్స్ కి ఆచార్య యూనిట్ గుడ్ న్యూస్ పంచింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే చరణ్ మరో లుక్ విడుదల చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పూర్తి స్థాయి మల్టీ స్టారర్ ఆచార్య. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలున్నాయి. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఆచార్య మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభిస్తున్నారు.
దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. ధర్మస్థలి తలుపులు తిరిగి తెరుచుకున్నాయి, ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభమైందని చిత్ర యూనిట్ తెలియజేశారు. మిగిలిన చిత్రీకరణ మొత్తం చివరి షెడ్యూల్ నందు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
అలాగే ఆచార్య నుండి చరణ్ మరొక లుక్ విడుదల చేశారు. కాషాయ రంగు చొక్కా ధరించి, ముఖాన బొట్టుతో నడిచొస్తున్న చరణ్ లుక్ ఆసక్తి రేపుతోంది. ఆచార్య మూవీలో చరణ్ సిద్ద అనే కీలక రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇక చిరంజీవికి జంటగా కాజల్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.