ఒక హీరోకి ఇరవయ్యేళ్ల పాటు హిట్టే లేకపోతే మరి ఎలా సర్వయివ్ అవుతాడనే అనుమానం రావచ్చు. అయితే ఆ హీరోకి హిట్టు రానిది పక్క రాష్ట్రంలోనే కానీ స్వరాష్ట్రంలో కాదు. ప్రేమలేఖతో తెలుగులో ఘన విజయం సాధించిన తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆ సినిమా వచ్చిన ఇరవయ్యేళ్లలో మళ్లీ తెలుగులో ఒక్కటైనా మంచి విజయాన్ని అందుకోలేకపోయాడు. ఒకటీ అరా సినిమాలు యావరేజ్‌గా ఆడాయి కానీ అజిత్‌కి మళ్లీ ‘ప్రేమలేఖ’లా ఏ సినిమా కలిసి రాలేదు. అతని గత చిత్రం ‘వివేకం’ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో మంచి రేట్ ఇచ్చి కొన్నారు కానీ అది ఇక్కడ కూడా డిజాస్టర్ అయింది. అతని తాజా చిత్రం ‘విశ్వాసం’ కూడా అంతగా ఎక్కలేదు జనాలకి.తమిళంలో ఘన విజయం సాధించిన ‘విశ్వాసం’ తెలుగులో రిలీజ్ అయ్యింది. రెండున్నర కోట్ల రూపాయలకి తెలుగు అనువాద హక్కులు తీసుకుని మరీ రిలీజ్ చేసారు. ఇది ఒక స్టార్ హీరోకి తక్కువే ..కానీ తెలుగులో థియేటర్లలో విడుదల కాకముందే తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో వచ్చేయడం వల్ల పైరసీ తాకిడి కూడా తీవ్రంగా వుండే అవకాశాలున్నాయి. లైన్ ఆడియోతో హెచ్‌డి ప్రింట్‌ని సినిమా విడుదలయిన కాసేపటికే ఇంటర్నెట్‌లో పెట్టేసే పైరసీదార్లు చాలా మందే వున్నారు కనుక అజిత్ తెలుగు లో స్ట్రెయిట్ సినిమా చేస్తేనే టాలీవుడ్ లో కూడా జండా ఎగరేయ్యొచ్చు.