ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్ది చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎంతటి చర్చనీయాంశం అవుతున్నాయో అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదల ప్రదర్శించిన చంద్రబాబు ఊహించని విధంగా స్కామ్ లో ఇరుక్కున్నాడు. దాంతో టీడీపీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ హోల్డ్ లో పడ్డాయి. స్కామ్ ల గోల లేకపోతే ఇప్పటికే నియోజిక పర్యటనలతో చంద్రబాబు ఫుల్ బిజీ బిజీగా గడిపేవారు. అలాగే నారా లోకేశ్ పాదయాత్రలో బిజీగా ఉండే వారు. కానీ ఊహించని విధంగా జగన్ సంధించిన వ్యూహాస్త్రానికి టీడీపీ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన స్కిల్ స్కామ్ 2018 లోనే బయటపడినప్పటికి, ఆ కేసు ను అప్పటి నుంచి హోల్డ్ లో ఉంచుతూ వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. .
ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా టీడీపీ బలంగా ప్రజల్లోకి వెలుతున్న క్రమంలో అనూహ్యంగా స్కిల్ స్కామ్ ను తెరపైకి తెచ్చి చంద్రబాబును కోలుకోలేని విధంగా దెబ్బ తీశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో టీడీపీ ఎన్నికల వ్యూహాలన్నీ ఒక్కసారిగా తారుమారయాయి. ప్రస్తుతం అధినేతను బయటకు తీసుకొచ్చే అంశం పైనే దృష్టి పెడుతూ ప్రచారాన్ని హోల్డ్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రచారం స్టార్ట్ చేస్తే ప్రజల్లో టీడీపీ ప్రస్తావన కనుమరుగౌతుందని జగన్ భావిస్తున్నారట. అందుకే త్వరలోనే ఎన్నికల ప్రచారనికి జగన్ సిద్దమౌతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రచారంలో కూడా చంద్రబాబు అవినీతినే ప్రధానంగా ప్రస్తావించాలని జగన్ భావిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం పథకాల అమలు విషయంలో పారదర్శికంగా పాలన సాగిస్తున్నామని, కాబట్టి తమ పాలనపై తక్కువ ప్రచారం చేస్తూ ప్రత్యర్థి లోపాలను ఎక్కువగా ప్రజలకు చూపించే విధంగా జగన్ ప్లాన్ చేశారట. మరి ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలు టైమ్ ఉన్నప్పటికి ఇప్పుడే పోలిటికల్ హీట్ కాకపుట్టిస్తుంటే.. ఇక ఎన్నికల సమయానికి ఈ హీట్ ఇంకా ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి.