ఏపీ రాజకీయాలు మాంచి వాడివేడిగా సాగుతున్నాయి.
ఆఫ్ లైన్ లో ఎంత వేడిగా ఉందో ఆన్ లైన్లోనూ అంతే వేడిగా రాజకీయాలు సాగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు – ప్రతి విమర్శలతో పాటు ఫేక్ న్యూస్ కూడా వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే కొందరు ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడి పథకంలో మాజీ మంత్రి –
టీడీపీ నేత నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా లబ్ధి పొందారంటూ తప్పుడు ప్రచారం ప్రారంబించారు. ఇందుకోసం ఫేక్ డాక్యుమెంట్లు కూడా ఆన్ లైన్లో ప్రచారంలోకి తెచ్చారు. అంతేకాదు.. తమకు రూ. 15 వేలు జమ చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లూ క్రియేట్ చేశారు.
దీనిపై బ్రాహ్మణి భర్త నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
[the_ad id=”4850″]
అమ్మ ఒడి పథకం కింద తన సతీమణి నారా బ్రాహ్మణి ఖాతాలోనూ రూ.15000 జమ చేసినందుకు తాను ధన్యవాదాలు చెబుతున్నట్టు సోషల్ మీడియాలో వెలిసిన పోస్టుపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
అది ఫేక్ పోస్టు అని స్పష్టం చేశారు. “మీ పిచ్చి డ్రామాలు నా దగ్గర కాదు… జగన్ ముందు వేసుకోండి. వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ సైలెంట్ గా ఉంటే మంచిది అంటూ ఆయన ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.
మార్ఫింగ్ చేసి తప్పుడు పనులు చేస్తే జగన్ దొంగ బతుకు గుడ్డలూడదీసి రోడ్డు మీద నిలబడెతా” అంటూ ఘాటుగా హెచ్చరించారు. రేపు శుక్రవారం… అక్కడ కొట్టుకోండి మీ డప్పు అంటూ లోకేశ్ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు.
ఐదు రూపాయల ముష్టి కోసం వైసీపీ పేటీఎం బ్యాచ్ పడుతున్న కష్టం చూస్తుంటే జాలి కలుగుతోందని లోకేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Content retrieved from: https://www.tupaki.com/politicalnews/article/Nara-Lokesh-Comments-on-about-Amma-Vodi/234008.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.