ఆర్టీసీ ఆదాయానికి గండి….జేబులు నింపుకొంటున్న తాత్కాలిక కండక్టర్లు
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడుపుతోంది. కొందరు ప్రైవేట్ కండక్టర్లు ఆర్టీసీ సొమ్మును తమ జేబుల్లోకి వేసుకుంటున్నారు. అక్టోబర్ 5న మొదలైన ఆర్టీసీ సమ్మెఇప్పటికీ కొనసాగుతోంది. ఇన్ని రోజులూ చర్చల ప్రసక్తే లేదన్న సర్కారు ఎట్టకేలకు మెత్తబడింది. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో.. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించడానికి ఈడీలు, ఆర్థిక సలహాదారుతో…