*ఆన్‌లైన్ వేదికపైకి 100 అమెరికా విశ్వవిద్యాలయాలు*
హైదరాబాద్: అమెరికాలోని వంద ప్రభుత్వామోదిత విశ్వవిద్యాలయాలు ఒకే వేదికపైకి రానున్నాయి. డిగ్రీ నుంచి పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఆయా విశ్వవిద్యాలయాలు నాలుగు రోజులపాటు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనా కారణంగా నేరుగా ఆయా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో వర్చువల్ విధానంలో చర్చించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది.
మాస్టర్స్, పీహెచ్‌డీ విద్యార్థుల కోసం వచ్చే నెల రెండు, మూడు తేదీల్లో, డిగ్రీలో చేరే విద్యార్థుల కోసం వచ్చే నెల తొమ్మిది, పది తేదీల్లో వీటిని నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే వారు ముందస్తుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మాస్టర్స్, పీహెచ్‌డీ విద్యార్థులు
bit.ly/EdUSAFair20EmbWeb లో, డిగ్రీలో చేరే విద్యార్థులు http://bit.ly/UGEdUSAFair20EmbWeb లో నమోదు చేసుకోవాలి.