నేటి సమాజం

సమాజం అనగానే ముందు మూడు విషయాలు గుర్తుకువస్తాయి. అవి మంచి, చెడు, పరువు. ఈ మూడు విషయాలు మీద తిరుగుతూ ఉంటుంది. మంచి చేసినా, చెడు చేసినా సమాజం తీరు మాత్రము మారదు. ఎందుకంటే మంచి చేసినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు చాలా తక్కువుగా ఉంటారు. అదే చెడు చేసినప్పుడు చిన్న ,పెద్ద అని తేడా లేకుండా బయటికి వచ్చి మరి నువ్వు చేసింది తప్పు అని చెప్తారు. ఇంకా దిగజారే పనులు చేసినప్పుడు సమాజంలో నీ పరువు పోతుంది అని చెప్తారు. సమాజానికి ఎప్పుడు మంచిగా కనపడకూడదు. మంచిగా కనిపించిన మనకి కనిపించకుండానే మంట పెడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మంచి చేస్తే చిన్న ఐనా, పెద్ద వాళ్ళు ఐనా ముందు అభినందించండి. చెడు చేస్తే వెళ్ళి చెవిలో చెప్పండి తప్పు లేదు. అంతే కాని నలుగురిలో ఒకరిని పెట్టి దోషిగా చూస్తే అది చాలా తప్పు అవుతుంది. నువ్వు ఒకరిని దోషిగా చూపిస్తే అది ఈ రోజుతో పోదు. సమాజం నీకోసం వేచి చూస్తా ఉంటాది. నువ్వు కూడా దోషిగా దొరుకుతావ్ అని.

మనలో కొంత మంది ఉంటారు. వాళ్ళు చేసే పనులకు వాళ్ళని ఏమి అనాలో కూడా తెలియదు.
కొంత మంది మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోటి మాట్లాడతారు !!అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్లినా గెలవలేరు ??ఎందుకంటే వాళ్ళ మాటలే వాళ్ళకి బుద్ధి చెప్తాయి కాబట్టి !!! పైన చెప్పిన విధంగా ఉండే వాళ్ళని మనం ఏమి అనాలిసిన అవసరం లేదు. అలాంటి వాళ్ళని సమాజమే చూసుకుంటుంది. ముందు మనము మారదాం.

Leave a Reply