
తెలుగు సినిమా కు 7 విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ :విషెస్ చెప్పిన ఎన్టీఆర్,పవన్,రాజమౌళి
Teluguwonders: 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. ‘మహానటి’లో నటనకు గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న కీర్తి సురేష్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. కీర్తి సురేష్ నటన అవార్డుకు అర్హమైనదేనన్నారు. ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈసారి తెలుగు చిత్రాలు మెరిశాయి. ఏడు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. . టాలీవుడ్ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి.ల.సౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. ☯‘మహానటి’…