వాడపల్లి వెంకన్న ఆదాయం 1.71 లక్ష రూపాయలు.

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు, ఆలయంలో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు నిర్వహించడంతో పాటు నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించిన భక్తులు అనంతరం అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి ఒక్క రోజులో రూ. 1,71,359 ఆదాయం సమకూరినట్లు ఉపకమిషనర్, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
