చిరు మాటలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా?

చిరు మాటలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా?
ఒక సీనియర్ నటుడి గురించి మరో ప్రముఖ నటుడు మాట్లాడటం ఒక ఎత్తు అయితే.. ఆయనకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు దక్కలేదన్న మాటను ఒక పెద్ద సభలో చెప్పటం ఆశ్చర్యకర విషయం మాత్రమే కాదు.. ఒక చక్కటి సంప్రదాయంగా చెప్పాలి. ఆ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కి థ్యాంక్స్ చెప్పాల్సిందే.
సీనియర్ మోస్ట్ నటుడైన సూపర్ స్టార్ కృష్ణ కు దక్కాల్సిన గౌరవం దక్కలేదని తనకు అనిపిస్తోందని.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించి ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కు సిఫార్సు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
సూపర్ స్టార్ కృష్ణ కు దాదా సాహెబ్ పురస్కారం దక్కితే అది తెలుగువారికి దక్కిన గౌరవంగా మారుతుందంటూ మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కృష్ణ గొప్పతనం గురించి పొగిడిన చిరు.. ఆయన చేసిన ప్రయోగాలు మరో నటుడు చేయలేదని చెప్పటం ఒక ఎత్తు అయితే.. అత్యున్నత పురస్కారం ఆయనకు ఇప్పించాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఉందన్న చిరంజీవి విన్నపానికి ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్నది ఆసక్తికరం.
ఏమైనా ఒక సీనియర్ మోస్ట్ నటుడు గురించి.. మెగాస్టార్ స్వయంగా ప్రస్తావించి.. పురస్కారానికి సిఫార్సు చేయాలనటం ఆరోగ్యకర పరిణామంగా చెప్పాలి.
[the_ad id=”4850″]
