April 4, 2026

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేరళ సీఎం విజయన్ ఘాటు కౌంటర్..

302e5b8b-86b5-4fb0-a45d-7ecc7c63d4b9

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. కేరళ పాలనపై చేసిన విమర్శలు పూర్తిగా నిరాధారమని ఆయన స్పష్టం చేశారు. గణాంకాలతో సహా ఘాటుగా కౌంటర్ ఇస్తూ, ముందుగా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

నీతి ఆయోగ్ ఎస్డీజీ సూచికలో కేరళ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, తెలంగాణ ఆరో స్థానంలో ఉందని విజయన్ తెలిపారు. కేరళలో పేదరికం కేవలం 0.55% ఉండగా, అక్షరాస్యత 95.3% ఉందని వివరించారు. ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండటం వల్ల జీవన ప్రమాణాలు కూడా మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు.

అదే సమయంలో తెలంగాణలో జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోందని విమర్శించారు. గతంలో తెలంగాణ అధికారులు కేరళ మోడల్‌ను అధ్యయనం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు విమర్శించడం విచిత్రమని అన్నారు.

అవసరమైతే కేరళకు వచ్చి పాలనపై పాఠాలు నేర్చుకోవాలని రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికారు


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading