హత్య చేసినందుకు 4 కోట్ల జరిమానా…

0

అదేంటి చంపినందుకు 4 కోట్ల జరిమానానా అనుకుంటున్నారు కదా! అయినా ఎవరైనా ఎవరినైనా చంపితే మరణశిక్ష విధిస్తారు లేదా యావ జీవిత కారాగార శిక్ష విధిస్తారు అంతేగాని జరిమానా విధించడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఇది చదవండి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న టోనీ మరియు పీటర్ థామ్సన్ అనే దంపతులకు అక్కడి న్యాయస్థానం ఏకంగా 6లక్షల డాలర్లు(సుమారు రూ. 4.22కోట్లు) జరిమానా విధించింది.

👉వారు చేసిన తప్పు ఏంటంటే : 180 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ చెట్టు(ఓక్)ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు యత్నించడం, ఆ చెట్టు కాస్త చనిపోవడంతో కోర్టు ఈ భార్యాభర్తలకు భారీ మొత్తం ఫైన్ వేసింది. ఇటీవలే ఈ దంపతులు కాలిఫోర్నియాలోని సోనోమాలో ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఈ క్రమంలో తమకు సంబంధించిన దగ్గరలోని ఓ ల్యాండ్‌లో 180 ఏళ్ల ఓక్ చెట్టుతో పాటు మరో రెండు చెట్లు ఉండేవి. వాటిని కొత్తగా కట్టుకున్న ఇంటి పక్కకు తరలించాలని భావించారు. దాంతో ఆ మూడు చెట్లను పెకలించారు. కానీ, చెట్ల తొలగింపు ప్రక్రియలో దెబ్బతినడంతో అవి చనిపోయాయి. అలాగే ఆ చెట్ల చుట్టూ పరిసర ప్రాంతం కూడా దెబ్బతింది. దెబ్బతిన్న భూమి కాస్తా ప్రభుత్వ పరిరక్షణలో ఉండడంతో పాటు 180 ఏళ్ల ఓక్ చెట్టు మరణించడంపై సోనోమా కౌంటీ సుపీరియర్ కోర్టు ఈ దంపతులకు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రాణం దేనిదైనా ప్రాణమే మరి..

Leave a Reply