90 కుక్కలని చంపేశారు ..

Teluguwonders:
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. అభం.. శుభం తెలియని మూగ జీవులను ఎక్కడపడితే అక్కడ అంతమొందిస్తున్నారు ఈ మానవ మృగాలు. ఒకే చోట దాదాపు 90 వీధి కుక్కల మృతుదేహాలు కనిపించేసరికి జంతు ప్రేమికుల గుండాలు బద్దలయ్యాయి. ఆ 90 కుక్కలు సహజంగా చావలేదు. కుక్కల కళ్ళకు తీగలతో కట్టేసి ఉంచడంతో ప్రజల్లో మరింత అనుమానాలు పెరిగాయి.
వివరాల్లోకి వెళ్తే ముంబైలోని బుల్దానా జిల్లా గిర్దా-సావల్‌దబరా మార్గంలో నివశించే ప్రజలకు భారీగా దుర్వాసన రావడంతో ఏం జరిగిందో ఒక్కసారిగా వారీకి అర్ధం కాలేదు. దీంతో వారు దుర్వాసన వస్తున్న వైపు వెళ్లి చూడగా రోడ్ల పక్కన చెల్లా చెదురుగా కుక్కలా మృతుదేహాలు పది ఉన్నాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మొత్తం ఐదు ప్రాంతాల్లోని దాదాపు 100 కుక్కల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 90 కుక్కలు మరణించగా మిగిలిన 100 కుక్కలు కోన ఊపిరితో చావు బతుకుల్లో ఉన్నాయి. దీంతో పోలీసులు వాటి మృతుదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తప్ప అసలు ఎం జరిగిందనేది చెప్పలేం అని పోలీసులు తెలిపారు. బీహార్ లోను కొద్దీరోజుల క్రితం పంట పొలాలను నాశనం చేసిందనే కోపంతో జింకని చంపి సజీవంగా పూడ్చిపెట్టిన ఘటనా కలకలం రేపిన సంగతి తెలిసందే.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
