HanuMan : ఈ నెల 15 న ‘హనుమాన్’ టీజర్

hanuman
Spread the love

HanuMan :  మొదటి సినిమా ‘ఆ’తోనే క్రియేటివ్ డైరెక్టర్‌గా ప్రశాంత్ వర్మ పేరు తెచ్చుకున్నారు.  ఆ తరవాత యాంగ్రీమ్యాన్ రాజశేఖర్‌తో ‘కల్కి’ సినిమా చేసి అందరినీ   ఆకట్టుకున్నారు. 2021 లో  యంగ్ హీరో తేజ సజ్జాతో  కలిసి ‘జాంబీ రెడ్డి’ సినిమా  చేశారు. తెలుగులో తొలి జాంబీ జోనర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు  వేపించుకొని  సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తరవాత తేజతో ‘హనుమాన్’  అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్టు ప్రశాంత్ వర్మ  ప్రకటించారు. ఈ  ప్రాజెక్ట్  గురించి ప్రేక్షకులకు చెబుతూ టైటిల్‌ను రివీల్ చేస్తూ ప్రశాంత్ వర్మ విడుదల చేసిన వీడియో అటు సినీ ప్రేక్షకులను, ఇటు నెటిజన్స్ ను అందరినీ  ఆశ్చర్యపరిచింది. ‘బాహుబలి’ రేంజ్‌లో ఈ సినిమా   ఉంటుదంటూ  అంతా ప్రశంసించారు.

ఐతే ఆ అంచనాలను  మరింత  రెట్టింపు చేయడానికి ఇప్పుడు ‘హనుమాన్’ టీజర్ మన ముందు వచ్చేస్తుంది. ఈనెల 15న ‘హనుమాన్’ టీజర్‌ను  విడుదల  చేయనున్నట్టు  సినిమా  యూనిట్ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *