రాజన్న పాలనకు అంతా రెడీ…

0

ఆంధ‌ఫ్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌లు హోరాహోరీగా సాగాయి. ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల అవుతున్నాయి ఇటు టీడీపీ, మ‌రోవైపు వైఎస్సార్‌సీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండ‌గా.. ఇటీవ‌లి విడుద‌లైన స‌ర్వేల‌న్నీ వైఎస్సార్‌సీపీవైపే మొగ్గుచూప‌డం విశేషం. దాంతో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్రమాణ‌స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నార‌ని స‌మాచారం.

👉జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవ‌గానే ముందుగా చేసే పనులు :
. ముందుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టిసారిస్తూ.. సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌క్ష‌ణమే తీసుకోల్సిన నిర్ణ‌యాల‌పై ఇప్ప‌టినుంచే స‌న్న‌ద్ధ‌మవుతున్నారు.

👉న‌వ‌ర‌త్నాల అమలు :‌ న‌వ‌ర‌త్నాల అమలు పై చిత్త‌శుద్ధితో ఉన్న జ‌గ‌న్ వాటి అమ‌లు, వాటి ప‌నితీరును స్వ‌యంగా ఆయన ప‌ర్యవేక్షించ‌నున్నారు.ముఖ్యంగా ముఖ్య మంత్రి అవ్వగానే ఆయన చేయబోయే పనులు ఇవి

👉 రైతులకు : జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే 5 ఎక‌రాలలోపు ఉన్న స‌న్న‌కారు, చిన్నకారు రైతుల‌కు, రైతు కుటుంబాల‌కు 50 వేల రూపాయ‌ల ఆర్థిక‌సాయం చేయ‌నున్నారు. వైఎస్సార్ రైతు భ‌రోసా కింద ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా ప్ర‌తీ రైతుకి భీమా సౌక‌ర్యం. ప్ర‌తీ సంవ‌త్స‌రం మే నెల‌లో నేరుగా ప్ర‌తీ రైతులకు చేతిలోకి చేరే విధంగా 12 వేల 500 రూపాయ‌ల పంట పెట్టుబ‌డి సాయం చేయ‌నున్నారు. పండించిన పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌పై ప్ర‌త్యేక నిధి ఏర్పాటు చేయ‌నున్నారు.

👉మ‌హిళ‌ల‌కు :డ్వాక్రా మ‌హిళ‌ల‌కు, పొదుపు సంఘాల అభివృద్ధికి 15 వేల కోట్ల రూపాయ‌ల‌తో ప్ర‌త్యేక నిధి ఏర్పాటు.

👉 పెన్ష‌న్‌: వృద్ధుల‌కు, వితంతువుల‌కు, విక‌లాంగుల‌కు 2వేల రూపాయ‌ల పెన్ష‌న్‌,

👉అమ్మ ఒడి ప‌థ‌కం: నిరుపేద కుటుంబాల పిల్ల‌ల చ‌దువుల కోసం  అమ్మ ఒడి ప‌థ‌కం కింద 5వ త‌ర‌గ‌తిలోపు పిల్ల‌ల‌కు ఒక్కొక్క‌రికి 5వంద‌ల రూపాయ‌లు, 5 నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకునే పిల్ల‌ల‌కు 750 రూపాయ‌లు, ఇంట‌ర్ విద్యార్థులకు వెయ్యి రూపాయ‌ల చొప్పున‌ నెలనెలా అంద‌జేయ‌డం. మ‌రింత ఉన్న‌త చ‌దువుల కోసం ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ వ‌ర్తింప‌జేయ‌డం.

👉పక్కా ఇళ్ళు: ప్రతీ పేద కుటుంబానికి పక్కా ఇళ్ల మంజూరు.

👉వైద్యం : వైఎస్సార్ హ‌యాంలో మంచి ప్ర‌జాధ‌ర‌ణ పొందిన ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని మ‌రిన్ని మార్పుచేర్పుల‌తో తిరిగి పున‌రుద్ధ‌రించ‌డం. కిడ్నీ త‌దిత‌ర దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న పేద‌ల‌కు ప్ర‌త్యేక పెన్ష‌న్‌. నిరుద్యోగ స‌మ‌స్య‌పై ప్ర‌త్యేక దృష్టి.
👉ప్రాజెక్ట్‌ లు :పోల‌వ‌రం అన్నీ సాగునీటి ప్రాజెక్ట్‌ల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయ‌డం. 👉మ‌ద్య‌పాన నిషేధం : మూడు ద‌శ‌ల్లో మ‌ద్యాన్ని నిశేధించేందుకు రిహాబిలిటేష‌న్ సెంట‌ర్లు స‌హా అవ‌స‌ర‌మైన అన్నీ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డ‌మే కాకుండా అందుకు కోసం కొత్త చ‌ట్టంతో పాటు ప్ర‌త్యేక యంత్రాగాన్ని సైతం ఏర్పాటు చేయ‌నున్నారు. ఇలా అన్నీ విధాలుగా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్.ఇవన్నీ అమలు అయితే మళ్ళీ రాజన్న పాలన రావడం ఖాయం…

Leave a Reply