ఏపీ లో మే23న జరుగబోయే కౌంటింగ్ విధి విధానాలు..ఇవే…

0

మరో పది రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి.అభిమానులు (ప్రజలు)ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఆ రోజు జరిగే విధి విధానాల గురించి ఒకసారి తెల్సుకుందాం. ఈనెల 23న జరిగే ఓట్ల లెక్కింపులో 👉తొలి ఫలితం అనంతపురం జిల్లాలో తక్కువ ఓట్లు ఉన్న పుట్టపర్తి నియోజకర్గంది వెలువడితే,
ఆఖరున చివర్లో రాప్తాడు, రాయదుర్గం ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 23న జరుగనున్న కౌంటింగ్‌ కార్యక్రమానికి కేటాయించిన సిబ్బందికి జేఎన్‌టీయూలోశిక్షణ ప్రారంభమైంది.
🔅కౌంటింగ్ ప్రదేశం :
అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంతోపాటు దాని పరిధిలోని అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ అసెంబ్లీ స్థానాలకు జేఎన్‌టీయూలో ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 👉హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంతోపాటు ఆ పరిధిలోని హిందూపురం, మడకశిర, పెనుకొండ, రాప్తాడు, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎస్కేయూలో ఏర్పాట్లు చేస్తున్నారు.
🔸లెక్కింపు ముహూర్తం :
ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటలకు ప్రారంభం కానుంది. తెల్లవారుజామున 4.00 గంటలకే సిబ్బంది కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఏర్పాట్లు చూడాలని కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. చివరిఓటు లెక్కించేదాకా సిబ్బంది ఎవరూ బయటకు వెళ్లడానికి వీలులేదని సూచించారు.

🔸లెక్కింపువిధానం :ఒక పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన ఒక ఈవీఎం చొప్పున 14 టేబుళ్లలో 14 ఈవీఎంలను ఒకేసారి లెక్కిస్తారు. ఆ సాయంత్రానికి పూర్తి ఫలితాలు విడుదల అవుతాయి.గెలిచిన వారు సంతోషం తో పండుగ చేసుకుంటారు. ఇదండీ ఆ రోజు ఎన్నికల ఫలితాల సంబరం.

Leave a Reply