మహేష్ బాబు న్యూ లుక్ సూపర్..

mahesh babu new look
Spread the love

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ సినిమా లుక్స్ కోసం తెగ కష్ట పడుతున్నాడు.

జుట్టు, గడ్డం, బాడీ పెంచి ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు మహేష్. అందుకే ఈ మధ్య మహేష్ బాబు ఎక్కడా చూసినా చర్చనీయాంశంగా మారుతుంది. ఇటీవల, మహేష్ మళ్లీ స్టైలిష్ & అద్భుతమైన లుక్‌లో కనిపించాడు.

నిత్యం విదేశాలకు వెళ్లే మహేష్ బాబు తాజాగా మళ్లీ విదేశాలకు వెళ్లాడు. అయితే, అది తన కొడుకుతో కలిసి అమెరికాలో ఉండటానికా లేక దర్శకుడు రాజమౌళి సినిమా కోసం వెకేషన్ కి వెళ్తున్నారా అనేది క్లారిటీ లేదు. ఈరోజు ఉదయం మహేష్, నమ్రత కలిసి హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్ లో నడుస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది.

మహేష్ స్టైలిష్ హుడీ వేసుకొని, గాగుల్స్, క్యాప్ పెట్టుకొని గడ్డం, లాంగ్ హెయిర్ తో అదరగొట్టాడు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *