హనుమాన్ సినిమా విజయంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ ధీమాగా ఉన్నాడు. అదే ఉత్సాహంతో సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. నటుడు నందమూరి సింహం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ రంగానికి పరిచయం కానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే, తాజాగా ఆయన తన సినిమాటిక్ యూనివర్స్ గురించి మరో అప్‌డేట్‌ను విడుదల చేశారు.
మూడో సినిమా గురించి ప్రశాంత్ వర్మ త్వరలోనే అప్డేట్ ఇవ్వనున్నాడు. ఈ విషయంపై అక్టోబర్ 10న ప్రకటన చేస్తానని.. సినిమా టైటిల్, నటీనటులను గురువారం ప్రకటిస్తామని ఆయన వెల్లడించాడు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్, మోక్షజ్ఞ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఏ సినిమా గురించి చెప్పనున్నారో తెలియాల్సి ఉంది.